సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 ఆందోల్ కాన్స్టెన్సీ ఇన్చార్జి మల్లేశం, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల పరిధిలో ఉన్న బొడ్మాట్ పల్లి గ్రామం లో నేడు ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ప్రథమ పౌరుడుతలారి అవినాష్ కుమార్ హాజరై ఆడపిల్ల, ఇంటికి దీపం…సమాజానికి వెలుగు.. దేశానికి చుక్కాని…అని కొనియాడారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలన్నారు. అంగన్వాడి టీచర్ దీపిక మాట్లాడుతూ బాలిక సంరక్షణ, రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, బేటి బచావో బేటి పడావో, కిశోర వికాసం, కేజీబీవీ పాఠశాలలో, అంగన్వాడి సెంటర్ ద్వారా పౌష్టికాహారాన్ని అందజేసి, సంక్షేమ పథకాల ద్వారా బాలికల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి,దీపిక హెల్పర్ గడ్డం అమల, గ్రామస్తులు చిన్నారులు పాల్గొన్నారు..