సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 రామ కుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యాధికారి పూజిత పేర్కొన్నారు మండలంలోని విజాలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కూలి పల్లి గ్రామంలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యాధికారి పూజిత మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు మీరు నిల్వ ఉండడం వల్ల లార్వా ఉత్పత్తి చెంది రోగాలు సంభవిస్తాయని పేర్కొన్నారు డెంగు మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ పరిసరాలను శుభ్రం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ప్రమీల హెచ్ ఏ బాలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.