ఎన్నికల లబ్ధికోసం మున్సిపాల్టీ పరిధిలోని కార్మికులకే – రుణమాఫి చెక్కుల పంపిణి

*మాటలే తప్ప చేతలులేని ప్రజా ప్రభుత్వం *చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫి వర్తింప చెయ్యాలి *గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ లో పత్రికా ప్రతినిధులతో గుండు వెంకటనర్సు మాట్లాడుతూ..ముఖ్యమత్రి స్వయంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులందరిని రుణ విముక్తి చేస్తామని చెప్పడమే కాక, 33 కోట్లు విడుదల చేస్తామని జిఓ కూడ ఇస్తున్నట్లు సభవేదిక నుండి దాదాపు 18 నెలల క్రింద ప్రకటించారని తెలిపారు. హామీని అమలు చెయ్యాలని ఎన్నోసార్లు సంబందిత మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను కమిషనర్ ను కలసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నవంబర్ 20 పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో స్పందించిన ప్రభుత్వం 33 కోట్లు ఆర్ధిక శాఖకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసిందని అన్నారు. మళ్ళీ కాలయాపన చేస్తుండటంతో పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులు నిరసన దీక్షలు చేయడతో దిగివచ్చిన ప్రభుత్వం మరో 16 కోట్ల 27 లక్షలు విడుదల చేస్తున్నట్లు జిఓ ఇచ్చిందని, అన్నారు. ఇక రుణమాఫి అమలు అవుతుందని కార్మికులు సంతోషంలో ఉన్న పరిస్థితిలో ఎన్నికల లబ్ధికోసం ప్రభుత్వం కేవలం మున్సిపాల్టీ పరిధిలోని కార్మికులకే రుణమాఫి వర్తింపచేసి చేతులుదులుపుకోవాలని చూస్తుందని విమర్శించ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫి వర్తింప చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *