సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 (కాప్రా మండల రిపోర్టర్: కిరణ్) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలోని పలు అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. సర్వేనెంబర్ 205,310 వికలాంగుల కాలనీ మోహన్ రావు నగర్ కాలనీ లో పలు అక్రమ కట్టడాలను గుర్తించి, నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను నిర్మిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, దళారుల మాటలు విని ప్రభుత్వ కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
