ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఆయిల్ ఫామ్ సాగును ‘రైతు బంధు’గా లేదా ‘బంగారు పంట’గా పిలుస్తున్నారు

*హార్టికల్చర్ ఆఫీసర్: కృష్ణయ్య & క్లస్టర్ ఆఫీసర్: మహేష్

సాక్షి డిజిటల్ న్యూస్, జిల్లా:వనపర్తి, మండలం:చిన్నంబావి రిపోర్టర్:క్రాంతి కుమార్ ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంలో సగటున మనిషికి 20 కేజీల నూనె ప్రతి సంవత్సరం వాడకంలో ఉంది.
ఈ లెక్కన భారతదేశం మొత్తం మీద 30 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె అవసరం కానీ ప్రస్తుతం ఉంది 13 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ సాగులో ఉంది. ఈ లెక్కన భారతదేశంలో మిగులు 17 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె అవసరం దీన్నిబట్టి చూస్తే భారతదేశం నూనె దిగుమతుల కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుందో అర్థం చేసుకోవాలి. చిన్నంబావి & వీపనగండ్ల మండలంలో నాటిన పామాయిల్ తోటల గెలలు 15 రోజులకు ఒకసారి కోయడం ,వాటిని మనమే కొనడం, 10 రోజులకు డబ్బులు నేరుగా రైతు అకౌంట్లో పడడం జరుగుతుంది . ఆయిల్ ఫామ్ కోసం గవర్నమెంట్ కూడా మొక్కలు మరియు డ్రిప్పు కోసం 90% సబ్సిడీ ఇస్తుంది కావున నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి నిరంతర ఆదాయం పొందగలరు అని కోరుతున్నాము.అని హార్టికల్చర్ ఆఫీరసర్ కృష్ణయ్య క్లస్టర్ ఆఫీసర్ మహేష్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *