పారిశుద్ధ్యమే ప్రజారోగ్యానికి పునాది – కార్మికురాలిగా మారిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ..

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 25 2026, యాప్రాన్, గ్లోవ్స్ ధరించి కాలువల్లో వ్యర్థాల తొలగింపు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రతిజ్ఞ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా మారి శ్రమించారు.శనివారం నాడు నందిగామ పట్టణంలోని బాబు జగజీవన్ రాం బిల్డింగ్ ఆవరణలో ఉన్న మెయిన్ డ్రైన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యాప్రాన్, గ్లోవ్స్ ధరించి దంత మరియు గంటే పట్టుకొని కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా సాధారణ కార్మికురాలిగా నిలిచి పనిచేయడం ద్వారా పారిశుద్ధ్య ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి ప్రధాన ధ్యేయం కావాలి శుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి మూలాధారం అని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని పారిశుద్ధ్యాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారి కృషిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందనను రాబట్టి, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే దిశగా కీలకంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్, పారిశుద్ధ్య సిబ్బంది, కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *