సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, రామకుప్పం సమీపంలో గల కుప్పం వ్యవసాయ మార్కెట్ అనుబంధం మార్కెట్ అయినా రామకుప్ప మినీ మార్కెట్ యార్డులో నూతన కూరగాయల హోల్సేల్ దుకాణాన్ని శనివారం కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిఎం రాజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆయన బందర్లపల్లి పంచాయతీ కేంద్రంలో గల రైతు భరోసా కేంద్రంలో రైతులకు సబ్సిడీ ధరలతో ప్రభుత్వం అందిస్తున్న యూరియాను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ ఏఎంసీ డైరెక్టర్ పవన్ కుమార్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.