ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

*కార్యకర్తల మధ్య కేక్ కటింగ్

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, జనవరి :25 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) రాష్ట్ర ఐటి, విద్యాశాఖ ల మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రామముని రెడ్టి, ఉపాధ్యక్షుడు వీరభద్ర, క్లస్టర్ ఇంఛార్జీ మహమ్మద్, కొండ్రాయుడు, వెంకటస్వామి, బాలకృష్ణా రెడ్డి, ఫయాజ్, జబిబుల్లా, శ్రీను, డక్కా రమేష్, పీరాసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *