రమణారావు అధ్వర్యంలో ముద్రగడ ను కలిసిన వైసీపీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు అమలాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ముద్రగడ పద్మనాభం మరియు ముద్రగడ గిరిబాబు ని మర్యాద పూర్వకంగా అయిన స్వగృహం నందు కలిసి ఘనంగా సన్మానించారు. అందరూ కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి చేయాలని అయినా సూచించారు. అమలాపురం నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకులు కుంచే రమణారావు అధ్వర్యంలో వైసీపీ స్టేట్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కుడుపూడి భరత్ భూషణ్,వేగిరాజు సాయిరాజు, తోట శ్రీను, బెజవాడ సత్తిబాబు, భీమనపల్లి గ్రామ సర్పంచ్ పెయ్యిల రాజ్ కుమార్, ఉప్పలగుప్తం మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి పినిపే జయరాజ్, ఈదరపల్లి మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, అల్లవరం మండల యువజన నాయకులు దేవరపల్లి నరేష్ మరియు నేరేడుమెల్లి శ్రీనివాసరావు, ఎం‌. వినోద్, పరమట రాజేష్, ముత్తాబత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *