సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 ఆత్రేయపురం మండల రిపోర్టర్ టీ.వి.కృష్ణారెడ్డి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీలుగా కర్రీ వెంకట గోవింద కృష్ణారెడ్డి మరియు బొక్కా నందిని శివ కళ్యాణి లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రావులపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జగ్గిరెడ్డి వారిని పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.