సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20/2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్: రాంరెడ్డి నగర్ కాలనిలో ప్రతి గల్లీలో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆకారపు అరుణ్ పటేల్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ మరియు ఓపెన్ నాలా సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న మ్యానహోల్స్ మరియు ఓపెన్ నాలాలను గుర్తించి మరియు నిండిపోయిన డ్రైనేజీ మ్యాన్‌హోల్సను తక్షణమే రిపేర్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో డ్రైనేజీ సమస్యల వల్ల ఏ ఒక్క సామాన్య పౌరుడు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోదండల రామాలయ డైరెక్టర్ శ్రీనివాస్ చారి మరియు మల్లయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలయ్య కాలనీ ప్రధాన కార్యదర్శి రాకేష్ కురుమ సంఘం అధ్యక్షులు సత్తయ్య కాంగ్రెస్ సెక్రెటరీ నాగచారి యూత్ కాంగ్రెస్ నాయకులు భాను, నవీన్, గిరి, వెంకటేష్, భాస్కర్, రాజేష్, శివ కాలనీ పెద్దలు మరియు పలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.