సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 20 ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ షేక్ మక్బూల్ బాష: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ”వి.హర్ష వర్ధన్ రాజు”ఐపీఎస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రదేశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసిఆర్‌బీ, స్పెషల్ బ్రాంచ్, ఐటి కోర్, డీపీఓ తదితర కీలక విభాగాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. నూతన జిల్లాకు అనుగుణంగా అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసేలా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పోలీస్ క్వార్టర్స్ చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ అక్కడ భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన వసతులను మెరుగు పరచడంతో పాటు, కార్యాలయాల్లో సమర్థవంతమైన పరిపాలన, నిర్వహణ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, మార్కాపురం సీఐ యం.సుబ్బా రావు, మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదులు బాబు, పెద్దారవీడు ఎస్ఐ సాంబశివయ్యతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.