సాక్షి డిజిటల్ న్యూస్ 20.01.26: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలును గొల్లలపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.నూకేష్, డా.దమయంతి, సర్పంచ్ విసరపు రమణా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పశు వైద్య అధికారులు మాట్లాడుతూ సోమవారం దిబ్బలపాలెం ఆర్ల గ్రామాల్లో రెండు బృందాలుగా ఏర్పడి వెటర్నరీ సిబ్బందితో సుమారు 197 పశువులకు మందులు పంపిణీ చేపట్టారు.శిబిరంలో మందులు, వాక్సినేషన్, నట్టల నివారణ, ఎద మందులు, వైద్య సేవలు ఉచితంగా అందచేస్తామని అన్నారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పత్రికా ప్రతి నిధులును, ప్రజా ప్రతినిధులు, అభ్యుదయ రైతులు సహకరించవలసినదిగా కోరారు.