సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 20, రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమావేశం రసాభాసగా మారింది. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని బీమా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అయింది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సరే ఉద్రిక్తత తగ్గలేదు. సమావేశం మధ్యలో నుండే మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లిపోయారు.