మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు పంపిణీ

* ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. * పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 వేములవాడ టౌన్ రిపోర్టర్ అక్కనపల్లి పరుశురాం: వేములవాడ పట్టణంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలో 871 మహిళా సంఘాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మహిళలకు కొనుగులు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలో సుమారు 20 వేల కోట్లు వెచ్చించారు. నేడు 1 కోటి 46 లక్షల రూపాయల మహిళాకి వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. గ్రామాల్లో మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. ఇందిర గాంధీ గరీబీ హటావో నినాదంతో పేద ప్రజలకు అండగా ఉన్నారు. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలాల కాకుండా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *