సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 రిపోర్టర్ సంజీవ్: అల్లూరి జిల్లా అరకులోయ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ స్థానంలో నూతనంగా ప్రవేశపెట్టిన వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అరకు వేలి మండలంలో బస్కి పంచాయతీ మొర్రిగూడ గాయ బంద, పూసాలి, బొండాం పంచాయతీ కొత్తవలస, పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ కాలనీ సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. బస్కి పంచాయితీలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు, బురిడీ దశరథ్, పద్మాపురం పంచాయతీ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు ఉపసర్పంచ్ జన్ని భగత్ రామ్, బొండం పంచాయతీలో సిపిఎం మండల నాయకులు గతుం బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు పని కల్పించే బాధ్యత నుండి తప్పించు కోవడానికి ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు ఉపాధి హామీ చట్టం మార్పు వలన పేదలకు పని హక్కు లేకుండా పోతుంది. 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్రం 90% నిధులు సమకూరుస్తే రాష్ట్రం 10% మాత్రమే భరించేది ప్రస్తుతం నరేంద్ర మోడీ బలవంతంగా ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి కేంద్రం 60 శాతం నిధులు కేటాయించారు. 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి భారం మోపడం జరిగింది .పేదలకు ఉపాధి కూలీలకు సకాలంలో కూలీలు చెల్లించే అవకాశం లేకుండా పోతుంది. యుపిఎ 1 ప్రభుత్వంలో సిపిఎం పార్టీ ఒత్తిడితో కామన్ మినిమం ప్రోగ్రాం లో భాగంగా ప్రజలకు పని గ్యారంటీ చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయించడం జరిగింది. దీనివలన పురుషులతో పాటు మహిళలకు సమానంగా వేతనాలు వచ్చింది ఉపాధి హామీ చట్టన్ని పటిష్టంగా అమలు చేస్తూ రోజు కూలి 600 రూపాయలు చెల్లించాలని 200 రోజులు పని దినం క ల్పించాలని పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించాలని పనిముట్లు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశంలో 71 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ ఉంటే అందులో 18.63% దళితులు 17.32 శాతం గిరిజనులు 36% అటాడుగులో ఉన్న దళితులు మైనారిటీలు అగ్రకుల పేదలు ఉన్నారు. పెత్తందారులకు భూస్వాములకు అనుగుణంగా ఉపాధి హామీ చట్టాన్ని సవరణ చేసి స్కీం పేరుతో రాష్ట్రానికి పని గ్యారంటీ లేకుండా నరేంద్ర మోడీ చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి భయపడి చట్టం నిర్వీర్యం చేస్తున్న నిర్ణయానికి మద్దతు పల్లకి పేదలకు పనులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ప్రతి వాడికి పని గ్యారంటీ ఉండాలని చెప్పి ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మండలంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పద్మం పురం పంచాయతీ ఉపసర్పంచ్ జన్ని భగత్, జి .సీతన్న టీ. సీతారాం జి. రామస్వామి టి. దేవరాజు టి. అప్పలస్వామి జి. రామన్న కే. మార్కండ్ కే. జాయో తదితరులు పాల్గొన్నారు.