విద్యుత్ లైన్మెన్ గుర్రాల సురేందర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన

* అడ్డగూడూరు ఏఈ భూక్య ఉమా.

సాక్షి డిజిటల్ న్యూస్/ జనవరి 20 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళ రామారం గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న గుర్రాల సురేందర్ రెడ్డి ఆదివారం రాత్రి మృతి చెందడం జరిగింది. అడ్డగూడూర్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ భూక్య ఉమా ఆయన స్వగ్రామం చందుపట్లలో సురేందర్ రెడ్డి పార్దిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సురేందర్ రెడ్డి దహన సంస్కరణ కోసం 30 వేల రూపాయలు ఆయన కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. ఏఈ భూక్య ఉమా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ అందేలా కృషి చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్పెక్టర్ కూరాకుల అంజయ్య, లైన్మెన్లు బెజ్జంకి ఉపేంద్ర చారి, ఎస్కే ఖాజా, నవిలె రామచంద్రయ్య, కాటం శీను, చిల్లర వెంకన్న, కాంతారావు, పెసర శ్రీనివాస్ రెడ్డి, గొడిశాల వెంకన్న, వై ఎంకన్న, పి వెంకటేష్, కేశగండ్ల మచ్చ గిరి, ఆర్టిజన్లు తుప్పుతి బీరప్ప, మార్చేటి అశోక్, పేరాల సురేష్, నిమ్మల నరేష్, నారబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *