సాక్షి డిజిటల్ న్యూస్, మరికల్, జనవరి 20, 2026, రిపోర్టర్ ఇమామ్: నారాయణపేట కలెక్టర్ జిల్లా అమ్మ ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేయాలంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమవారం నాడు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మంత్రోని పల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు అయిందని బాలరాజు మరికల్ లో స్థానిక విలేకరులతో తెలిపారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల కింద మొదటి విడత కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని ఆయన వివరించారు. నేటికీ ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాలేదని. అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదంటూ ఆయన తెలిపారు. ప్రతిసారి అధికారులు అడిగితే కొలతలు కొలతలు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వివరించారు. ఇంటి నిర్మాణం కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదఅన్నారు. మండల అధికారులకు విన్నవించిన ఏమి పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ బిల్లు కోసం ఎదురు చూస్తున్నామని బాధితుడు బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నారాయణపేట జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ బిల్లును మంజూరు చేయాలని బాధితులు మండల అధికారులను కోరుతున్నారు.