సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి: బి.కొత్తకోట రంగసముద్రంరోడ్డు లోనివాకర్స్ ప్రాంగణంలో వాకర్స్ ప్రతినిధికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం శ్రీ యోగివేమన జయంతి సందర్భంగా యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివానులార్పహించారు, ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత ప్రజల ప్రజాకవి, తాత్వికుడు, సంఘసంస్కృత, మానసిక శాస్త్రవేత్త అయిన యోగివేమన భోధనలో సత్యమే మార్గంగా. మానవత్వమే. మతంగా. సమానత్వమే. ఆశయంగా కుల, మత భేదాలకు అతీతంగా మూఢ విశ్వాసాలతో విభేదంగా, బుద్ధి, శుద్ధి, కర్మ పల తత్వాలను ప్రతి తరానికి ఆదర్శమని, 1816సిపి బ్రాన్ 18సంవత్సరాల శ్రమతో వేమన శతకాలను సేకరించారని 1910హోవర్ట్ క్యాంబెల్ లోకకవిగా విశ్వ వ్యాప్తం చేసారని యోగివేమన కీర్తి తెలుగు ప్రజల ఆస్థి నిరంతర స్ఫూర్తి అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు యం, గోపాల్, యస్, నాగభూషణం, డి,రాజశేఖర్, డాక్టర్ హరనాథ్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ రెడ్డి, యస్,బదిరి, సాగర్ శ్రీనివాస్, యస్,శ్రీకాంత్, ఓ,యల్ శంకర నారాయణ, జి,మురళి, టి, వెంకటేష్, యస్,గోపాలకృష్ణ మూర్తి, యం, సత్యనారాయణ, యం, సాయిరాం, డి,యల్ నరసింహులు, కె,క్రిష్ణమూర్తి, డి,యస్ శ్రీనివాస్, యస్,శంకర నారాయణ, వి,హరనాథ్ రెడ్డి, టి,లక్ష్మీ నారాయణ, ఓ,యల్ పతి,ఎ, యస్,ఐ బాలాజీ, కె,వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.