కూటమి ప్రభుత్వం దోపిడీకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాగా మారింది

* సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి దోపిడీ.. ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత.. చందాల నుంచి వచ్చింది ఎంత.. ప్రజలకు లెక్క చెప్పాలి. * ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ పాటించని అధికారులు.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 ఆత్రేయపురం మండల రిపోర్టర్ టీవీ కృష్ణారెడ్డి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ రోజు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది అని ఆయన అన్నారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడడం పై మీ ఉద్దేశం ఏమిటి అని ఆ నకిలీ టిక్కెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా కూటమి చర్యలు చేస్తుంటే సనాతన వాదులు అని చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు మేముంటానని ఆయన తెలిపారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అలాగే చందాల రూపంలో వచ్చింది అంతా అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అక్కడ లోకల్ గా ఉన్న ఎంపీపీ మరియు జడ్పిటిసి ప్రోటోకాల్ ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *