సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 పాలేరు రిపోర్టర్ పి వెంకన్న: మండలానికి సాగునీరు తాగునీరు వచ్చేంతవరకు ఎన్నో ప్రజా ఉద్యమాలలో తన వంతు పాత్ర ప్రజా పోరాటాలు నిర్వహించిన నునావత్ కాంతమ్మ తిరుమలాయపాలెం మండలం బిసరాజు పల్లి గ్రామంలో మరణించిన విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఖమ్మం జిల్లా నాయకులు కమ్మకోమట్టి నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, యడ్లపల్లి నవీన్, మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు, బానోత్ శంకర్, తావూరియా, తిమ్మిడి రఘుబాబు, కాంతమ్మ భౌతిగాయంపై మాస్ లైన్ ఎర్ర జెండా కప్పి, పూల దండలు వేసి జోహార్లు అర్పించినారు వారి కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేసి న కమ్మ కోమటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పిండిప్రోలు గ్రామ అభివృద్ధిలో అమరుడు రాయల నాగేశ్వరరావు, కల్లూరు వాసయ్య,రాయల బాబు, నాయకత్వంలో ముందుండి అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప మహిళ నాయకురాలని నాగేశ్వరరావు అన్నారు. కాంతమ్మ మరణం విప్ల ఉద్యమానికి తీరనిలోటని క్రమశిక్షణ కలిగిన మహిళ నాయకురాలని కోల్పోవడం బాధాకరమని కాంతమ్మ కుటుంబానికి పార్టీ వేళ వేల అండదండలు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నునావత్ వీరన్న, మూడు హాము, మూడు వెంకన్న, సుక్య, బోడ రమ్య, బోడ సేమియా , తాళ్లపల్లి నరసయ్య. తదితరులు పాల్గొన్నారు.