సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ కంటోన్మెంట్ సికింద్రాబాద్. 20/01/2026: కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరోధకులుగా మారిన కేంద్రం లోని బిజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రేపటి నుంచి కార్ఖానా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న రిలే నిరహార దీక్ష గోడ పత్రిక (పోస్టర్) ను కాంగ్రెస్ పార్టీ నాయకులతో సోమవారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దిగివచ్చి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేంతవరకు ఈ పోరాటం ఆగదని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేస్తామని, కంటోన్మెంట్ ప్రజల కష్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుర్తించి కంటోన్మెంట్ బోర్డును విలీనం చేసేంతవరకు నా ఈ పోరాటం ఉంటుందని, నా జీవితం కంటోన్మెంట్ ప్రజల అభ్యున్నతికే అంకితమని అన్నారు.