సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 జగిత్యాల జిల్లా ఇంచార్జ్ బోనగిరి మల్లారెడ్డి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద శంకరమ్మ మరియు మంద సత్తన్న లకు ముగ్గురు సంతానం ఒక కూతురు ఇద్దరు కొడుకులు. వారి చిన్న కొడుకు మంద నరేష్ (35) అను అతడు నేరెళ్లలో వేరుగా తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తన భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళినాడు. అలా వెళ్ళిన తను ఒక రోజు అంతా ఇంటికి రాలేదు. వారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ కనబడలేదు. యువకుడి తల్లి అయిన మంద శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మపురి పోలీసులు విచారణ చేసే క్రమంలో తర్వాత రోజు సారంగాపూర్ మండలం బట్టపల్లి గ్రామ శివారు ప్రాంతంలో చెలిమెల లొద్దిగుట్ట వద్ద ఉరి వేసుకున్న ఒక మృతదేహం ఉంది అన్న సమాచార మేరకు వెళ్లి చూడగా అట్టి మృతుడు తప్పిపోయిన మంద నరేష్ గా గుర్తించబడినాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది.