సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో తగ్గేదే లేదు ఎమ్మెల్యే తలసాని

సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి19- సనత్ నగర్ – సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు… మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీ సందర్భంగా జరిగిన అరెస్ట్ లు, ఆందోళనలకు సంబంధించిన వీడియో లను ప్రదర్శన శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే… చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారు. ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. భయానక వాతావరణం సృష్టించారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతం అయ్యాము అక్రమంగా అరెస్ట్ లు చేసి ఇబ్బందులకు గురి చేశారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మగౌరవం సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతాం న్యాయస్థానం నుండి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాదిమంది తో ర్యాలీ నిర్వహిస్తాం ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దాం. ఆందోళనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన తలసాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *