సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.19 రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్: సయ్యద్ సలీం పాషా… రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి జాతర పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్.మాఘ అమావాస్య సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాట్లు చేశాం.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయంగా సీత రామ చంద్ర స్వామి ఆలయం ఉంది.శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశాం.భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ ముందుకు సాగాలి.స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. గతంలో కాలినాడకన ఎడ్ల బండి మిద వచ్చేవారు.ఇప్పుడు వేలాది మంది భక్తులు స్వామి వారి సన్నిధికి వస్తున్నారు.ప్రజలందరికీ మాఘ అమావాస్య జాతర శుభాకాంక్షలు..
