కేజీహెచ్ లో వైద్యం కోసం వచ్చే రోగులు దగ్గర డబ్బులు అడిగితే కఠిన చర్యలు

*కెజీహెచ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19, జిల్లా ఇంచార్జి జాన్, విశాఖపట్నం కేజీహెచ్లో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరిం చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అత్యవసర వైద్య విభాగము, బర్నింగ్ వార్డ్, శరీర పునర్నిర్మాణ శస్త్ర చికిత్స విభాగము తదితర విభాగాలను తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేజీహెచ్ లో ట్రీట్ మెంట్ కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈవిషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కేజీహెచ్ సూపరిండెం డెంట్ను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని, రోగులు సిబ్బంది ఎవరికీ డబ్బులు ఇవ్వరాదని పేర్కొన్నారు. కేజీహెచ్ లో ఉచి తంగా వైద్యం లభిస్తుందని తెలియజేసే బోర్డులు పెట్టాలని సిబ్బందిని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరిండెండెంట్ ఐ.వాణి, పరిపాలన అధికారి బి.వి.రమణ, ఆర్ఎంవో బంగారయ్య, ఇతర విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *