సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 19, రిపోర్టర్ తిరుపతి సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఆదివారం రోజు గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య, మరియు వార్డు మెంబర్లు ఆతుకూరి వైకుంఠం, బొమ్మ స్వామి, మీసా కిష్టవ్వ, కొంతం శ్రీనివాస్, సీత యాదగిరి, మరియు సీత అనిత లు లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.