సాక్షి డిజిటల్ న్యూస్ / జనవరి 13 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటిమట్ల గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు. అడ్డగూడూరు మండలంలోని వ్యవసాయంత్రీకరణ పనిముట్లు పొందిన లబ్ధిదారులు 1) వెల్దేవి ఇటికాల కృష్ణ కు పవర్ టిల్లర్ ,2) అడ్డగూడూరు తుప్పతి వరలక్ష్మి కి రోటవేటర్ 3) బొడ్డుగూడెం పొట్టేపాక నాగయ్య, కోటమర్తి 4)చిత్తలూరి చంద్రమౌళి, 5)కంబాల రమేష్ లకు కల్తీవేటర్స్ 6) కొటమర్తి చిత్తలూరు సోమయ్య,7) చిర్రగూడూర్ చిత్తలూరు ప్రశాంత్,8) గట్టుసింగారం కడారి అనిల్, 9)లక్ష్మీ నర్సు ) రాపాక( డి )ముక్కామల అనిల్ లకు పవర్ స్పేయర్లు అందజేశారు. మొత్తం పదిమంది లబ్ధిదారులకు 5,91,070/- రూపాయలు,సబ్సిడీ 2,75,860 /- రూపాయల విలువ గల వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేశారు. అనంతరం అడ్డగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు తహసిల్దార్ శేషగిరి రావు, అగ్రికల్చర్ ఏవో పాండురంగ చారి, పలు శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.