గ్రామిణంలో పుట్ట గొడుగుల్లా గొలుసు దుకాణాలు….

*నియంత్రణ చేపట్టాలని మహిళా సంఘాల డిమాండ్… *ప్రజల ఆరోగ్యం తో చెలగాటం…. *ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే బోటల్ పై అదనంగా రూ 10 లు వసిల్…. *నిద్రమత్తులోఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ శాఖ అధికారులు….

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం: మండలంలో వివిధ గ్రామా ల్లో మద్యం గొలుసు దుకాణాలు జోరు ఎక్కువైంది. మండలంలో ప్రభుత్వం అనుమతి తో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు ఆరు ఉండగా అందులో మండలం కేంద్రం రావికమతంలో మూ డు, కొత్తకోట,టి అర్జాపురం, తట్టబంద లలో చెరో ఒకొక్క దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 50 పైగా మద్యం గొలుసు దుకాణాలను గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసుకున్నా రు. ప్రభుత్వం నిబంధన లు ప్రకారం గొలుసు దుకాణాలు పెట్టేందుకు అనుమతి లేదు. గ్రామ నాయకులతో పాటు ఎక్సజ్ శాఖ అధికారుల అండ దండలతో మద్యం వ్యాపారులు గొలుసు దుకాణ దారులు ఊరు కట్టు బాట్లు పేరుతో ( లక్షల్లో వేలం పాట) ప్రతి గ్రామంలో మద్యం గొలుసు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతి కలిగిన మద్యం దుకాణంలో మద్యం ధర కన్నా గొలుసు దుకాణం లో మరో రూ.10 నుంచి రూ 30 వరకూ అదనంగా ఎక్కవ వసిళ్ళు చేస్తూన్నారన్న ఆరోపనులు వినిపిస్తు న్నాయి.కొత్తకోట శివాలయం వీధిలో ఓ గొలుసు దుకాణం తో పాటు వెళ్ళంకి వీధి, బి ఎన్ రోడ్డు లో పాన్ షాప్ లలో మరో నాలుగు గొలుసు దుకాణలు నిర్వహిస్తుండగా, దొండపూడి, మేడివా డ, చినపాచిల, జెడ్,కొత్త పట్నం, కల్యాణ పు లోవ, తదితర గ్రామాలలో డిమాండ్ ను బట్టి మద్యం గొలుసు దుకాణాలు ఏర్పాటు చేశారు. నిబంధన లు ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ మద్యం అమ్మకాలు నిర్వహిస్తారు. అయితే రాత్రి 10 తర్వాత ఉదయం 10 వరకూ గొలు సు దుకాణాలలో మద్యం విక్రయాలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతి కల్పించిన మద్యం తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కల్తీ మద్యం కూడా అమ్ముతున్నారని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.దీనిపై మాడుగుల సెక్షన్ ఎక్స్ జ్ శాఖ సి ఐ ఉపేంద్ర ను వివరణ కోరగా గ్రామాలలో అనుమతి లేని మద్యం గొలుసు దుకాణా లపై సమాచారం అందిస్తే కేసులు నమో దు చేస్తామన్నారు. బోటల్ పై రూ 10 వసూల్ కు ప్రభుత్వం జీవో ఇంకా ఇవ్వలే దని అప్పటి వరకూ అదనం గా వసూ ల్ చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై మ ద్యం సిండికేట్ వ్యాపారులతో సమా వేశం ఏర్పాటు చేస్తామని సి ఐ పేర్కొన్నారు..శేషు రావికమతం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *