సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి13 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతసాగరం మండల కన్వీనర్ బిజివేముల పిచ్చి రెడ్డిని రాష్ట్ర వైయస్సార్ టిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మెట్టుకూరు సుబ్బారెడ్డి, ఆత్మకూరు సోషల్ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్ మరియు అనంతసాగరం సోషల్ మీడియా కన్వీనర్ బట్రెడ్డి నాగేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2026 నూతన సంవత్సర వైయస్సార్ టిఎఫ్ డైరీని అందజేసి, ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు.