రామన్నపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మానం

*రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం *రామన్నపేట ఉపసర్పంచ్ మోటి రమేష్ ఘన సన్మానం * పదో వార్డు మెంబర్ కందుల అండాలు ఘన సన్మానం *మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కందుల హనుమంతు

సాక్షి డిజిటల్ న్యూస్,13 జనవరి 2026,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను ఆదరించి సర్పంచ్‌గా అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో వీధిలైట్లు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.అలాగే గ్రామాల్లో కుక్కలు, పందులు, కోతుల బెడదను నివారించేందుకు ఇప్పటికే పాలకవర్గం తీర్మానం చేసి చర్యలు ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామాభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు, సంఘాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, మచ్చగిరి, మీనమ్మ, వేణు, రమేష్, అండాలు, పార్వతమ్మ, సుదర్శన్, నూర్జహాన్, అన్వర్, మహేష్, కవిత, లింగస్వామి,అనిత, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *