సాక్షి డిజిటల్ న్యూసు జనవరి 13, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు సితాయిపేట్ గ్రామంలోని చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ నిహారిక చిన్న పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సితాయిపేట్ ఉపసర్పంచ్ చంద్రకాంత్, శ్రీనివాస్, రాములు, వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
