సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు కాట్రేనికోన మండలం కందికుప్ప శివారు మొల్లేటిమొగలో వేద పాఠశాలలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, భీమవరం మరియు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య, మహర్షి వేదిక యూనివర్సిటీ, నెదర్లాండ్స్ సంయుక్త నిర్వహణలో శ్రీ పూజ్య మహర్షి మహేష్ యోగివర్యుల 109 వ జన్మదిన మహోత్సవ మునకు అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లు హాజరయ్యారు. వేద పాఠశాలలోని పరమేశ్వరుని దర్శనం అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనతరం పలువురు ఘనాపాటి లను ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చిబాబు లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.