గద్వాలలో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు

*విశ్వశాంతి మహా యజ్ఞాన్నికి తన వంతు సహాయంగా స్వామి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ కి 50,000/-యాభై వేల రూపాయలను గద్వాల పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి) మరియు 23 వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు అందించడం జరిగింది.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 12 2026 రిపోర్టర్ రాజు జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాలలో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో భాగంగా…గద్వాల పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి).. మరియు 23వ, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం రోజు విశ్వశాంతి మహా యజ్ఞానికి తన వంతు సహాయం గా స్వామి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపనంద స్వామీజీకి 50,000 యాభై వేల రూపాయలను ధర్మ కార్యానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు వారి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కు స్వామి వారి ఆశీస్సులు కలగాలనిభగవంతుని ప్రార్థిస్తున్నాము అని స్వామి వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గడ్డం కృష్ణారెడ్డి, బండ్ల రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కరెంట్ శ్రీనివాసులు, ర్యాలంపాడు నరేందర్ రెడ్డి, పాగుంట నవీన్ కుమార్ రెడ్డి,BRK న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు, చాపల దౌలు,దౌదర్ పల్లి మధు, కొత్త గణేష్, దరూర్ కర్రెప్ప తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *