సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 2 భూమయ్య పిట్లం మండలం. పిట్లం మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం ప్రభుత్వ కార్యాలయంలో శుక్రవారం నాడు పిట్లం గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ కు సన్మానం నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులతో అభివృద్ధి పదం లో చేసి నిరూపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవేజ్ ,కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి,ఎరుకల అశోక్ ఐకెపి ఎపిఎం, సిబ్బంది ముత్యం రెడ్డి, ఉత్తం కుమార్, కార్య సిబ్బంది పాల్గొన్నారు.