సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి: 3, కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ పిట్ల .అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బముగా కరపత్రాలు, పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో రవాణా శాఖ తరుపున పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో అదనపు సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్ కే నరసింహ రెడ్డి, జిల్లా రవాణా అధికారి జే. శ్రీనివాస్ తో పాటు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.