అడ్డగూడూరులో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్/ జనవరి 03 అడ్డగూడూరు రిపోర్టర్ నోముల ఉపేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కేంద్రంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి , డ్రైనేజీలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ వేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు పంచాయతీ కార్యదర్శి నరేష్, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *