సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 3, 2026 అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్, వీరారెడ్డి మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని త్రిపురవరం గ్రామ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని భూపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ గ్రామస్థాయిలో విజయం పొందడంలో వీరారెడ్డి విస్తృత సేవలు అందించారని ఆయన కొనియాడారు. పార్టీ సన్నత విషయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ సానుకూలంగా నాయకత్వాన్ని వహించిన వ్యక్తి వీరారెడ్డి అని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో గ్రామస్థాయిలో ఆయన పాత్ర అమోఘమని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని భూపాల్ రెడ్డి దుఃఖించారు.అనంతరం ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన వెంట త్రిపురవరం సర్పంచి మాదాసు జ్యోతి కృష్ణ, చనుపెళ్లి ఉపసర్పంచి దాసి నాగరాజు, అమీనాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు, రామినేని పూర్ణచంద్రరావు, చనుపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు ధనమంత రెడ్డి, మండల నాయకులు చిత్తలూరి సుధాకర్, గరిడేపల్లి సైదులు,ఆరెపుడి వెంకటేశ్వర్లు, కానుకుర్తి రామారావు, తదితరులు పాల్గొన్నారు.