సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03 జి.మాడుగుల: రీ సర్వే ద్వారా భూములకు కొత్త పట్టాలు పాస్ పుస్తకాలు పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ అభివృద్ధి తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎంపీపీ లంబోరి అప్పలరాజు,తహశీల్దార్ జి రాజ్ కుమార్ తెలిపారు జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ గొయ్యిగుంట గ్రామంలో శుక్రవారం రీ సర్వే కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన లబ్ధిదారులు వాటిని సద్విని యోగం చేసుకోవాలని కోరారు గొయ్యిగుంట గ్రామంలో 46 మందికి రీ సర్వే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను వారు పంపిణీ చేశారు. రాజముద్ర తో కూడిన రీ సర్వే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినందుకు రైతులు ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షుడు త్రిమూర్తులు, టిడిపి జిల్లా నాయకుడు సోమేలి చిట్టిబాబు, యువత జిల్లా నాయకుడు వంజరి చిరంజీవి నాయుడు, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ ఈశ్వరరావు, మండల సర్వేయర్ మోహన్ రావు, వీఆర్వో చిరంజీవి, గ్రామ సర్వేయర్లు గౌరీ, సంధ్య, అగ్రికల్చర్ అసిస్టెంట్ కృష్ణ వెల్ఫేర్ అసిస్టెంట్ శివ కూటమి నాయకులు పాల్గొన్నారు.