సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్పందించి బ్లాంకెట్స్ అందించిన అధికారులు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులకుప్రత్యేక కృతజ్ఞతలు కలెక్టర్. కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఒక ప్రణాళిక తోటి ముందుగానే సమాచారం అందించిన మేరకు స్పందించి పెద్ద ఎత్తున బ్లాంకెట్స్ అందించినందుకు జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2500 బ్లాంకెట్స్ అవసరం ఉన్నాయని సుమారు 1000 కి పైగా బ్లాంకెట్స్ రావడం జరిగిందని విద్యార్థులకు వెంటనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
