సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, రిపోర్టర్ సంజీవ్ అల్లూరి జిల్లా అరకులోయ పాఠశాలను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ అరకు వేలి మండలం మాదల పంచాయతీ బట్టివలస ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఆ పాఠశాలను శుక్రవారం దొన్ను దొర సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో విద్యాబోధనలో నాణ్యత గురించి పరీక్షించారు. పాఠశాల పరిస్థితిపై ఉపాధ్యాయులు దొను దొరకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిధిలావస్థకు చేరుకున్న బట్టివలస ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిధులు మంజూరు అయ్యేలా చూస్తానన్నారు. పాఠశాల నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సీ చైర్మన్ బొరి బొరి లక్ష్మీ, మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, యువ నాయకులు కిల్లో శ్యామ్, బొరి బొరి పోతురాజు, సూపర్ మాజీ ఎం పీ టీ సీ వంతల వెంకటరావు, క్లస్టర్ కో ఆర్డినేటర్ కుడేలి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
