కొప్పునూర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం

సాక్షి డిజిటల్ న్యూస్, జిల్లా:వనపర్తి, మండలం: చిన్నంబావి, రిపోర్టర్: క్రాంతి కుమార్, ​చిన్నంబావి మండలం జనవరి:2 వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూర్ గ్రామంలోనీ అంగన్‌వాడీ కేంద్రం-3లో గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం (విహెచ్ఎన్డి) మరియు (ఏఎల్ఎమ్ఎస్ సి)(అంగన్వాడి లెవల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కమిటీ సమావేశం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కల్పించారు.​పౌష్టికాహార పంపిణీ లబ్ధిదారులకు ఒక పూట భోజనంతో పాటు,టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) కింద పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నారుల ఎదుగుదల కోసం అందించే పౌష్టికాహారం ప్రాముఖ్యతను వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బిచ్చన్న , ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనీ ఏఎల్ఎంఎస్ సి కమిటీ సభ్యులు కేంద్రం పనితీరును, అందుతున్న సేవలను సమీక్షించి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం గర్భిణులు మరియు శిశువుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిచ్చన్న ఉపసర్పంచ్ సుదర్శన్ వీరితో పాటు అంగన్‌వాడీ టీచర్లు లక్ష్మి,ఆశా కార్యకర్తలు ఉమ ఈశ్వరమ్మ బాలమణి అమూల్య,గర్భిణులు, బాలింతలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *