రైతు గుర్తింపు నమోదు కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద శుక్రవారం రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు గుర్తింపు నమోదు కొరకు ఇబ్బంది పడకుండా ఏఈఓ గజానంద్ తో మాట్లాడి గ్రామ పంచాయతీలోనే రైతు గుర్తింపు నమోదు కార్యక్రమం జరిగేలా ఏర్పాటులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, ఏఈఓ గజానంద్, రైతులు, గంగారెడ్డి, నర్సయ్య, శ్రీశైల మల్లేష్, సత్తయ్య, హనుమంతు, రాజారెడ్డి, నారాయణ, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *