సాక్షి డిజిటల్ న్యూస్ : జనవరి 02:ఆసిఫాబాద్ కొమురం భీమ్ :రాజ్ కుమార్ బాధితుడికి విద్యుత్ శాఖ తరపున 80000వేల నష్టపరిహారం చెక్కు అందజేసిన ట్రాన్స్కో ఆసిఫాబాద్ సర్కిల్ SE ఉత్తం జాడే, మరియు అధికారులు. కెరమెరి మండలం సుల్తాన్గూడ గ్రామానికి చెందిన షేక్ ముస్తఫా రెండు ఎద్దులు విద్యుత్ షాక్ తో మృత్యువాత పడగా బాధితుడికి ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇప్పించే దిశగా NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ చొరవ తీసుకొని పేద కుటుంబానికి చెందిన బాధితుడు తరపున స్వయంగా వరంగల్లోని విద్యుత్ శాఖ అధికారులను కలిసి తక్షణమే అతడికి నష్టపరిహారం మంజూరు అయ్యేవిధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేలా చొరవ తీసుకోవడం జరిగింది. శుక్రవారం నాడు బాధితుడికి అసిఫాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెక్కుని అందించి ఆదుకున్నారు. విజ్ఞప్తికి మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించి బాధితుడికి నష్టపరిహారం అందించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెల్పడం జరిగింది.