సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: మల్లాపూర్ మండలం ఉపసర్పంచ్ ల ఫోరం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గడ్డం సోమారెడ్డి (మల్లాపూర్), ఉపాధ్యక్షునిగా బాలసాని ప్రణయ్ (చిట్టాపూర్), ప్రధాన కార్యదర్శిగా బానోతు శ్రీనివాస్ (వాల్గొండ), కోశాధికారిగా రొడ్డ హారిక రాజు ( వేంపల్లి), వంగ పోతయ్య ( ముత్యంపేట), తోట రాజ్ కుమార్( గొర్రెపల్లి ) లను కార్యదర్శులుగా మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో ఉపసర్పంచులు పాల్గొన్నారు.