సాక్షి డిజిటల్ న్యూస్ 3 జనవరి 3026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు, మండల, జిల్లా పాలన అధికారులకు వినమ్ర సూచన
ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామాలు మరియు పట్టణాల్లో చాలా వీధి కుక్కలు వైరస్ లేదా చర్మ సంబంధిత వ్యాధుల గజ్జిస్కేబీస్బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అనేక చోట్ల కుక్కల శరీరంపై గజ్జి లక్షణాలు,వెంట్రుకలు రాలడం, చర్మంపై పుండ్లు కనిపిస్తున్నాయి ఈ వ్యాధి ప్రభావం కేవలం కుక్కలకే కాకుండా, ఇతర జంతువులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పశువులు, పెంపుడు జంతువులు మరియు పరిసర ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. వీధి కుక్కలు కూడా జీవులే కావున,వాటి ఆరోగ్యాన్ని కాపాడటం మన సామాజిక బాధ్యత. కావున ప్రభుత్వం మరియు స్థానిక పాలకులు క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ప్రతి గ్రామం పట్టణంలో వెటర్నరీ లేదా జంతు సంక్షేమ శాఖ ద్వారా వీధి కుక్కలకు ఉచిత వ్యాక్సిన్ మరియు అవసరమైన ఇంజెక్షన్లు అందించే కార్యక్రమం నిర్వహిం చాలి. వ్యాధి సోకిన కుక్కలకు చర్మ వ్యాధి చికిత్స గజ్జి నివారణ మందులు ఇంజెక్షన్లు ఇవ్వాలి అవసరమైతే ప్రత్యేకంగా ఎనిమల్ మెడికల్ కాంప్స్ ఏర్పాటు చేయాలి. వ్యాధి వ్యాప్తి నివారణపై గ్రామపట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి వీధి కుక్కల ఆరోగ్య సంరక్షణ కోసం దీర్ఘకాలిక పరిష్కార ప్రణాళిక రూపొందించాలి ఈ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో, ప్రజారోగ్యం మరియు జంతు సంక్షేమం కోణంలో పరిశీలించి,వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే వాటి సంతాన నియంత్రణ స్టెరిలైజేషన్ తక్షణమే చేపట్టాలి చెవుల రవీందర్ గొల్లపల్లి మండల మున్నూరు కాపు అధ్యక్షులు బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు.