సంక్రాంతి సంబరాలు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు

*ఈతల పోటీలు రంగోలి పోటీలు, పతం గులు పోటీలు, ఈనెల 11, 12, 13 తేదీల లో సమర్థవంతంగా నిర్వ హిస్తూ *జిల్లా కలెక్టర్ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
కోనసీమ భౌగోళిక పరిస్థి తులు అందాలు విశిష్టతను విశ్వవ్యాపితం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు ప్రజాప్ర తినిధులకు పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక మండల పరిధిలోని పులిదిండి గ్రామంలో కయాకింగ్ డ్రాగన్ బోటింగును జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్థానిక శాసన సభ్యులు బండారు సత్యానందరావులు లాంఛనం గా ప్రారంభించారు. అనంతరం మూడు రోజుల పాటు నిర్వ హించనున్న పోటీల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లను వారు పరిశీలిం చారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్ర పండుగగా ఈ యొక్క ఉత్సవ పోటీలను మూడు రోజులపాటు పకడ్బందీ రక్షణ భద్రత ఏర్పాట్ల మధ్య విజయవంతంగా నిర్వహిం చాలని అధి కారులను ఆదే శించారు. సందర్శకులు తాకిడి కి అనుగుణంగా జెట్టీలు లైఫ్ జాకెట్లతో రక్షణ పరమైన ఇండస్ట్రీ జాగ్రత్తలు పాటిస్తూ క్రియాశీలకంగా వహించాల న్నారు. కయాకింగ్, డ్రాగన్ బోటింగ్ పోటీల నిర్వహణకు ముందే స్పష్ట మైన ప్రణాళిక, భద్రతా ప్రమాణాలు, సాంకేతిక నియమాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిం చాలన్నారు.బోట్లు పడవ లు, ప్యాడిల్స్, లైఫ్ జాకెట్లు రక్షణ బోటు,సేఫ్టీ బోట్ మెడికల్ టీం వంటి కనీస సౌకర్యాలు సిద్ధంగా ఉంచా లన్నారు.గత ఏడా ది కన్నా ఈ ప్రాంత విశిష్టత కు వన్నె తెచ్చే విధంగా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఏడాది నిర్వహించాలని స్థానిక శాస నసభ్యులు బండారు సత్యా నంద రావు అన్నారు. సం క్రాంతిని పురస్కరించుకుని ఈ మూడు రోజులపాటు ఈ యొక్క విజయవంతం గా నిర్వహిస్తూ రాష్ట్రవ్యా ప్తంగా ఈ యొక్క డ్రాగన్ పోటీ ఉత్సవాలకు వన్నె మరియు గుర్తింపు తేవాలని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోపీ కమిటీ సభ్యులకు సూచించారు. కోనసీమ ప్రాంత ఖ్యాతిని ఇనుమ డింప చేసేలా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలను అత్యంత వైభవోపేతంగా కనుల పండు గగా అంగ రంగ వైభవంగా నిర్వహిం చాలని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు యొక్క ఈవెంట్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నారు బొబ్బర్లంక నుండి లొల్లలాకుల వరకు మేజర్ మెయిన్ కాలువ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుతో ఉండడం మన అందరి అదృ ష్టంగా భావించాలన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాం తం టూరిజం హబ్ గా తీర్చిదిద్దబడి సత్ఫలితాలను ఇచ్చేలా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేక చొరవ తీసుకోవడం హర్షనీయమ న్నారు జిల్లా పోలీస్ సూపరింటెం డెంట్ రాహుల్ మీనా ప్రసం గిస్తూ అఖండ గోదావరి తీర ప్రాంత సాంస్కృతి సాంప్రదా యాలను ప్రతిబింబించేలా హిందువుల అతిపెద్ద పండు గ సంక్రాంతినీ పురస్కరించు కొని ఈ ఉత్సవాలు నిర్వ హించడం సంతోషదాయ కమన్నారు. ఈ పోటీల నిర్వహణలో స్థానిక శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ వా రు తీసుకున్న చొరవను ఎస్పీ అభినందిం చారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో పీ శ్రీకర్ డిఎస్పి మురళీమోహన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, తాసిల్దారు ఆర్డి రామచంద్రమూర్తి మండల స్థాయి అధికారులు, శ్రేయ మీడియా బృందం బోటు ఫెస్టివల్ కమిటీ నిర్వాహకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *