సాక్షి డిజిటల్ న్యూస్ 7 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు : వందేమాతరం గేయం 150 ఏళ్ల కావడంతో మండలంలోని రైవాడా ఎంపీపీ స్కూల్ లో పంచాయతీ కార్యదర్శి జామి అప్పారావు జాతీయ జెండాను ఆవిష్కరించి వందేమాతరం గీతాన్ని విద్యార్థులు ఆలపించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రసమరంలో కోట్ల మంది భారతీయుల గుండెల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటికీ 150 ఏళ్లు పూర్తయ్యని జామి అప్పారావు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు బంకింగ్ చంద్ర చటర్జీ వందేమాతరం గేయం బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేయన్నారు ఈ గేయం స్ఫూర్తితో స్వాతంత్ర పోరాటంలో కోట్లాదిమంది భారతీయులు బానిస సంకెళ్లు తెంచేందుకు యుద్ధ రంగంలో కదం తొక్కి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు ఈ గేయం చరిత్రలో నిలిచిపోతుందనికొనియాడారు ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ పార్టీ ఉపాధ్యక్షులు చల్లా నాయుడు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు