సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 ; తుంగతుర్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి దస్తగీర్ తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో మురుగు నీటి సమస్య తీవ్రం పోస్ట్ ఆఫీస్, హెల్త్ సబ్ సెంటర్, మినీ బ్యాంకు ఉన్న రోడ్డుపై మురుగు ప్రవాహం; ప్రజలు ఆగ్రహంతో అధికారులు స్పందించాలంటూ డిమాండ్ తుంగతుర్తి మండలంలోని రావులపల్లి గ్రామంలో మురుగు నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీ నుండి వచ్చే మురికి కాలువ పూర్తిగా నిండిపోయి, ఆ మురుగు నీరు బొడ్రాయి బజారు దాటుతూ మెయిన్ రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఈ రహదారిలోనే గ్రామ పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్, అలాగే కెనరా బ్యాంకు సహకారంతో నడుస్తున్న మినీ బ్యాంకు ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు ఈ రహదారిపై నడుస్తూ తమ అవసరాల కోసం వస్తున్నారు. కానీ మురుగు నీరు రోడ్డంతా వ్యాపించడంతో ఉపాధి కూలీలు, వృద్ధాప్య పింఛన్‌దారులు, మహిళలు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం “ఆరోగ్యమే మహాభాగ్యం” అని చెబుతున్న తరుణంలో, అదే రహదారిపై ఉన్న హెల్త్ సబ్ సెంటర్ వద్ద మురుగు నీరు నిల్వ ఉండటం ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. దుర్వాసనలు, దోమల సమస్య, చుట్టుపక్కల కాలుష్య వాతావరణం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామస్థులు ఆవేదనతో చెబుతున్నారు
“మినీ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, హెల్త్ సెంటర్ ఉన్న ఈ ప్రధాన రహదారి ప్రతిరోజూ వందలాది మంది ఉపయోగించే మార్గం. అయినా గ్రామ సెక్రటరీ, మండల అధికారులు నిమ్మకు నీరు నెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు అని అన్నారు ప్రజలు పై అధికారులను వేడుకుంటూ నిండిపోయిన మురికి కాలువను వెంటనే తీయించి, మురుగునీరు రోడ్లపైకి రాకుండా అరికట్టాలని కాలువను శుభ్రపరచి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలి” అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల విజ్ఞప్తి: “ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే ఈ ప్రధాన రహదారిని తక్షణమే శుభ్రపరచి, మురుగు నీటి ప్రవాహాన్ని ఆపాలి. అధికారులు ప్రామాణిక చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనకు దిగుతాం” అని గ్రామస్థులు హెచ్చరించారు.