వందేమాతరం గేయం 150 వసంతాల వేడుకలు

*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ భారత జాతీయ గీతం 'వందేమాతరం' రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు: అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అదనపు ఎస్పీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ భావాన్ని ప్రతిబింబిస్తూ కార్యాలయం ఆవరణలో ఉన్న భారతమాత చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, అదనపు ఎస్పీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ , పోలీస్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో కలిసి సామూహికంగా వందేమాతర గేయాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో అశేష ప్రజానీకానికి వందేమాతరం గేయం గొప్ప స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చిందని, దీనిని రచించిన బంకిం చంద్ర చటర్జీని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ గేయం దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ డి ఎస్ పి శ్రీ సుబ్బరాజు , ఎస్ బి సీఐ పుల్లారావు , డి సి ఆర్ బి సీఐ మురళి కృష్ణ , ఏ ఆర్ ఆర్ ఐ లు బ్రహ్మానందo కోటేశ్వరరావు మరియు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *